దాసరిని ఆయన మానసికంగా హింసించాడట!


టాలీవుడ్‌ చిన్న సినిమాలకు పెద్దన్న, టాలీవుడ్‌కే పెద్ద దిక్కు అయిన దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణం తర్వాత పలు ఆసక్తికర విషయాలు బటయకు వస్తున్నాయి. దాసరికి అత్యంత ఆప్తుడు, ప్రియ శిష్యుడు అయిన మోహన్‌బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఎంతో మంది దాసరి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ఆయనను కడసారి చూసేందుకు కూడా రాలేదు. ఇక ఒక నిర్మాత గురువు గారిని మోసం చేశాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న ఒక నిర్మాత దాసరి వద్ద ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ 25 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బు ఇవ్వకుండా ఆ నిర్మాత నష్టాలు వచ్చాయంటూ అబద్దాలు ఆడాడు. దాంతో దాసరి కుమారులు గురువుగారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో గురువు గారు పడ్డ మానసిక వేధన నాకు తెలుసు. కొడుకులకు సమాధానం చెప్పుకోవడం ఇబ్బంది పడ్డ ఆయన నాతో పలు సార్లు ఆ విషయమై చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ నిర్మాత ఇప్పుడు మంచి ఆర్థికంగానే ఉన్నాడు. అయినా కూడా ఆ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం సిద్దంగా లేడు. ఆ నిర్మాత ఎవరు అనేది నేను చెప్పను కాని, అతడు భవిష్యత్తులో అయినా ఫలితాన్ని అనుభవిస్తాడు అంటూ మోహన్‌బాబు అన్నాడు. దాసరి చనిపోయిన సమయంలో ఆయన సాయంను అప్పుడే మర్చిపోయారు. దాసరిని మోసం చేసిన వారు ఎవరు, ఆయన సాయంను గుర్తించిన వారు ఎవరు అనే విషయం నాకు తెలుసు అంటూ మోహన్‌బాబు అన్నారు.

To Top

Send this to a friend