బాహుబలిపై వివాదాస్పద వ్యాఖ్యలు..

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం బాలీవుడ్‌ సినిమాలను సైతం తలదన్నేలా వసూళ్లను రాబట్టింది. 1500 కోట్ల కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన ‘బాహుబలి’ని చూసి బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కడుపు మంటతో రగిలి పోతున్నారు. కొందరు పైకి ప్రశంసలు గుప్పిస్తున్నా లో లోపల మాత్రం ఒక ప్రాంతీయ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్‌ రావడం సహించలేక పోతున్నారు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు మరియు దర్శకులు. తాజాగా ఒక బాలీవుడ్‌ దర్శకుడు ‘బాహుబలి’పై నేరుగానే విమర్శలు చేయడం జరిగింది.

2001 సంవత్సరంలో బాలీవుడ్‌లో ‘గదర్‌ : ఏక్‌ ప్రేమ్‌ కహానీ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనీల్‌ శర్మ ‘బాహుబలి’పై వివాదాస్పదంగా స్పందించాడు. 2001లో తాను తెరకెక్కించిన గదర్‌ సినిమా 265 కోట్లను వసూళ్లు చేసింది. అప్పట్లో అదో సంచలనం. అయితే అప్పుడు టికెట్ల రేట్లు కేవలం 25 రూపాయలు మాత్రమే ఉండేవి. ఇక తక్కువ థియేటర్లలో కూడా విడుదల చేశాం. అంటే ఇప్పుడు లెక్కల ప్రకారం నా సినిమా 5000 కోట్లు వసూళ్లు చేసినట్లుగా చెప్పుకోవచ్చు.

నా సినిమా ముందు ‘బాహుబలి’ వసూళ్లు చేసిన 1500 కోట్లు పెద్ద లెక్క కాదని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన అహంకార పూరిత వ్యాఖ్యలపై సౌత్‌ సినీ వర్గాల వారితో పాటు కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా సక్సెస్‌ సాధిస్తే దాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం ఏంటంటున్నారు. ‘బాహుబలి’ సినిమా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ సినిమా అన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాను గౌరవించాలని కొందరు అంటున్నారు. బాలీవుడ్‌ నటుడు ఒకరు అనీల్‌ శర్మ వ్యాఖ్యలను కుల్లు వ్యాఖ్యలు అంటూ కొట్టి పారేశారు.

To Top

Send this to a friend