ఎన్టీఆర్‌ విషయంలో తప్పుచేశానన్న

దిల్‌రాజును చూసి సినిమాలను నిర్మించాలనుకునే వారు చాలా తెలుసుకోవాలి. కథల ఎంపిక విషయంలో దిల్‌రాజు తర్వాతే మరే నిర్మాత అయినా అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దిల్‌రాజు ఒక కథను నమ్మి సినిమాను నిర్మించాడు అంటే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ అయ్యి తీరుతుందనేది ఇండస్ట్రీలో ఉన్న వాదన. అయితే ఎన్టీఆర్‌తో దిల్‌రాజు నిర్మించిన ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దిల్‌రాజు నిర్మించిన చిత్రాల్లో అతి పెద్ద ఫ్లాప్‌గా ఇప్పటికి కూడా అదే ఉంది.

‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాను హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించాడు. ఆ సినిమా ఫ్లాప్‌పై తాజాగా దిల్‌రాజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గబ్బర్‌సింగ్‌ తర్వాత ఎన్టీఆర్‌తో హరీష్‌ శంకర్‌ ఒక సినిమా ప్లాన్‌ చేశాడు. నా వద్ద ఎన్టీఆర్‌ డేట్లు ఉండటంతో పాటు హరీష్‌ శంకర్‌ ఒక కథను సిద్దం చేసుకు వచ్చాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. అయితే అప్పుడే వచ్చిన ‘రెబల్‌’ చిత్ర కథ హరీష్‌ శంకర్‌ తయారు చేసిన కథ సేమ్‌ ఉన్నాయి.

చివరి నిమిషంలో కథను మార్చాల్చి వచ్చింది. ఎన్టీఆర్‌ డేట్లు వృదా అవుతాయనే ఉద్దేశ్యంతో తాను హరీశ్‌ శంకర్‌తో మరో కథను సిద్దం చేయాల్సిందిగా చెప్పాను. హడావుడిగా ‘రామయ్యా వస్తావయ్యా’ కథను సిద్దం చేసుకుని వచ్చాడు. టైం లేక పోవడంతో తాము కథపై ఎక్కువ టైంను స్పెండ్‌ చేయలేకపోయాం. ఆ కథతో ఎన్టీఆర్‌ సినిమాను నిర్మించడం పెద్ద తప్పుగా ఆ తర్వాత తెలిసింది. కాని అప్పటికే జరగకూడనిది జరిగి పోయింది. ఎన్టీఆర్‌ నమ్మకంను కోల్పోయాను, ఆ సినిమా సక్సెస్‌ అయితే మళ్లీ మళ్లీ ఎన్టీఆర్‌తో సినిమాలు నిర్మించే అవకాశం వచ్చేదని నిర్మాత దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.

To Top

Send this to a friend