ట్రెండ్ సెట్టర్-దిల్ రాజు


ప్రస్తుతం దిల్ రాజు ఫుల్ ఫాంలో ఉన్నాడు. సంక్రాంతికి శతమానం భవతి, ఆ తర్వాత జనవరి నెలాఖరులో నేనూ లోకల్ మూవీలను రిలీజ్ చేసి దిల్ రాజు హిట్ కొట్టాడు. మార్కెట్ ను కరెక్ట్ గా అంచనావేసి సరిగ్గా మార్కెట్ చేయడంతో ఈ రెండు సినిమాలు భారీ హిట్ లు అయ్యాయి. ఒక్కో సినిమా 35 కోట్ల షేర్ ను తెచ్చుకొని శర్వానంద్, నానిల మార్కెట్ ని అమాంతం రెండింతలు చేశాయి.

దీంతో మళ్లీ దిల్ రాజు హిట్ నిర్మాతగా మారిపోయారు. గోల్డెన్ హ్యాండ్ ట్యాగ్ ని తిరిగి సంపాదించుకున్నారు. ఈ రెండు బ్లాక్ బస్టర్ మూవీల తర్వాత దిల్ రాజు మణిరత్నం సినిమా ‘చెలియా’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మణిరత్నంపై అభిమానంతో గతంలో ‘ఓకే బంగారం’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అది మామూలుగానే ఆడింది. అయినా కూడా ఇప్పుడు దిల్ రాజు మళ్లీ మణిరత్నం లేటెస్ట్ మూవీ ‘చెలియా’ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ప్రస్తుతం దిల్ రాజు ఫాం చూశాక చెలియా సినిమా కూడా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇండస్ట్రీలో నెలకొంది. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ లో ప్రస్తుతం దిల్ రాజు ఫుల్ బిజీగా ఉన్నారు.

To Top

Send this to a friend