అనసూయ, శ్రీముఖి, రష్మీ రాలేదు.. దీక్ష వచ్చింది..

ఆశ్చర్యకరంగా ఎవ్వరూ ఊహించని.. సినిమాల్లో కనిపించని.. దీక్ష అనే వర్థమాన హీరోయిన్ కం నటిని బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎన్టీఆర్ పంపించారు. ఈ మె ముఖం తెలుగు ప్రేక్షకులకు తెలీదు. అయినా ఒడ్డూ పొడవు.. అందం చందం ఉండడంతో ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు ఎవరీ దీక్ష అనే చర్చ నడుస్తోంది..

మొదట ఈ బిగ్ బాస్ లోకి తెలుగు టీవీ చానల్స్ లో హాట్ యాంకర్ గా చేస్తున్న అనసూయ ఎంట్రీ ఖాయమన్నారంతా.. ఆమె లేకపోతే మరో సెక్సీ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ లోకి ఈ వారమే జాయిన్ అయిపోతుందని అన్నారు. వీరిద్దరూ నో చెప్తే ఇక చివరగా యాంకర్ రష్మీ ఎంట్రీ ఇస్తుందన్నారు. కానీ వీరెవ్వరికీ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ దక్కలేదు. ఊహించని షాక్ ను ఎన్టీఆర్ ప్రేక్షకులకు ఇచ్చాడు..

బిగ్ బాస్ నుంచి సంపూర్ణేష్ బాబు అర్థాంతరంగా వైదొలగడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఇక రెండు వారాలు ఇద్దరు సెలబ్రెటీలు జ్యోతి, గాయని మధుప్రియలు బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకు వచ్చేశారు. దీంతో సంపూ స్థానంలో కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరినో ఒకరిని పంపిస్తారని అందరూ ఊహించారు. అనసూయ వస్తుందని, కాదు శ్రీముఖి అని,, కాదు కాదు రష్మీ అని అనుకున్నారు. కానీ వీరెవరూ రాలేదు.. చివరగా దీక్ష అనే అందం, చందం ఉన్న ఓ యాక్టర్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. విశేషమేంటంటే ఈమెకు తెలుగు సరిగ్గా రాదు. ఇప్పటికే ముమైత్ కు తెలుగు రాక ఇబ్బంది పడుతున్న జనాలకు మరో తెలుగు రాని యాక్టర్ ను పంపించి బిగ్ బాస్ ప్రేక్షకులకు జండూ బామ్ రాసుకోవాలని సూచించినట్టే ఉంది..

హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు చాలా బిజీ.. ఆమె వివిధ చానెల్స్ లో హోస్ట్ గా వ్యాఖ్యాత పలు షోలను ఒప్పుకొని చేస్తోంది. అవన్నీ వదలుకొని రావాలంటే కనీసం కోటిన్నర పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసిందట.. ఇది దాదాపు ఎన్టీఆర్ కు ఒక వారానికి ఇచ్చే పారితోషికంతో సమానమట.. అందుకే ఆమెకు నో చెప్పి ఇలా దీక్ష అనే సెక్సీ, యూత్ లేడీని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించారు.

To Top

Send this to a friend