డిగ్గీ ఐసిస్ వ్యాఖ్యలు.. కేసీఆర్ కలవరం..


ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిగా చిరపరిచుతుడైన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పోలీసులపై, వారిని ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ‘తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్ సైట్ తయారు చేసి యువతను రెచ్చగొడుతున్నారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్ అధికారం ఇచ్చారా.. అయితే దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ ట్వీట్ చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేగింది.

దీనిపై మంత్రి కేటీఆర్ , తెలంగాణ డీజీపీ బదులుగా ట్వీట్ చేశారు. ‘ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి దిగ్విజయ్ సింగ్ బాధ్యతారహిత్యంగా వ్యాఖ్యలు చేయడం తగదు. డిగ్గీ బేషరతుగా ఉపసంహరించుకోవాలి. లేదంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న పోలీసుల నైతికతను ప్రశ్నించే అర్హత దిగ్విజయ్ కు లేదు. ’ అంటూ కేటీఆర్, తెలంగాణ డీజీపీ ప్రతిస్పందించారు.

కాగా ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి. ఐసిస్ తీవ్రవాదులను సానుభూతి పరులను పట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ అనైతిక పనులు చేస్తుందన్న అపవాదు జనంలోకి వెళ్లింది. నిజంగా చేస్తున్నారా.? కేసీఆర్ ఇలాంటి పనులు చేస్తారా అన్నది అయోమయంగా మారింది. ముస్లిం యువతను టార్గెట్ గా పెట్టి తెలంగాణ పోలీసులు ఇలా చేస్తున్నారన్న డిగ్గీపై ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఆ వ్యాఖ్యలను ఎవరూ ఖండించకపోవడం.. క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.

కాగా డిగ్గీరాజా ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చి కాంగ్రెస్ సభలో మాట్లాడారు. అప్పుడే ఈ విషయం ఆయన దృష్టికి వచ్చినట్టుంది. పర్యటన ముగిసి ఢిల్లీ వెళ్లగానే ట్విట్టర్ లో ఆ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ కుట్ర కోణం బట్టబయలు అయ్యింది. దీని తెరవెనుక తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే ఉన్నారన్నది ఇన్ సైడ్ టాక్..

To Top

Send this to a friend