ధోనిపై అభిమానం, గౌరవమంటే..


ఫుణె-ముంబై మధ్య గురువారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్.. ఇందులో కేవలం 3 బంతుల మిగిలి ఉండగా ఫుణె విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో పుణె కెప్టెన్ స్మిత్ , రహానె బాగా రాణించి విజయాన్నిందించారు. కానీ పుణె కెప్టెన్ గా స్మిత్ ఉన్నా మ్యాచ్ లో మొత్తం ధోనియే చేశాడు. ఫీల్డింగ్ సర్దుబాటు, నిర్ణయాలన్నీ ధోనినే చేశాడు. స్వయంగా స్మిత్ కూడా ధోని దగ్గరకు వచ్చి కొన్ని సందేహాలు అడగడం విశేషం..

భారత కెప్టెన్ ధోనిలో గొప్ప నాయకుడు ఉన్నాడు. ధోని వల్లే భారత జట్టు క్రికెట్ లో ప్రపంచకప్, టీట్వంటీ, టెస్టుల్లో నంబర్ 1 సాధించింది. ప్రస్తుతం మునుపటి ఆట లేకపోవడం తో ఎందుకొచ్చిన గొడవ అని ధోని టెస్టులకు, వన్డేలకు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. సాధారణ ఆటగాడిగా రాణిస్తున్నాడు. కానీ ఇప్పటికీ ధోని అంటే అందరికీ అభిమానమే.అందుకే ఫుణె-ముంబై మ్యాచ్ లో ఫుణె జట్టులో ఉన్నవాళ్లందరూ ధోని చెప్పినట్టు చేశారు. కెప్టెన్ స్మిత్ కూడా ధోని సలహాలు తీసుకున్నాడు. రహానె అయితే మా కెప్టెన్ స్మిత్ అయినా ధోనినే అన్నీ చేశాడని.. అతడి నాయకత్వ లక్షణాలు అద్బుతమని.. ధోని చెప్పినంటే చేస్తామని విలేకరుల సమావేశంలో చెప్పడం గమనార్హం.

To Top

Send this to a friend