ధనిక రైతుల రాష్ట్రంగా మార్చేస్తా..


కేసీఆర్ తెలంగాణ రైతుల దశను, దిశను మార్చేందుకు నడుం బిగించారు. టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్ రైతులపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ రైతన్నలను దేశంలోనే ధనిక రైతులుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలోని రైతుల ఖాతాల్లో ఇక నుంచి ఖరీఫ్, రబీల్లో రెండు విడతలుగా రూ.4వేల చొప్పున ఎరువులు, విత్తనాలు కొనేందుకు డబ్బులు వేస్తామని చెప్పారు.

అంతేకాదు.. ఈ పథకంలో భాగంగా తెలంగాణను పంటకాలనీగా విభజిస్తామని.. ఆయా జిల్లాల్లోని వాతావరణం, వర్షపాతం ఆధారంగా పంటలు పండించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని.. అవి ఉమ్మడిగా వ్యవసాయం చేసి లాభం పొందేలా కార్యచరణ చేస్తామని కేసీఆర్ చెప్పారు..

కేసీఆర్ చెప్పిన వరాలు అమలైతే.. తెలంగాణ రైతుల పంట పండినట్టే.. ఇప్పుడు రైతులు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయానికి అప్పులు చేయకుండా ప్రతి రైతుకు రూ.4వేలు ఇచ్చేందుకు ప్లాన్ చేసింది. అంతేకాదు.. పంట కాలనీలు ఏర్పాటు చేసి మార్కెటింగ్, పంటలు తదితర వాటి గురించి ప్రభుత్వమే ప్లాన్ చేస్తుంది. దీంతో రైతుల పంట పండినట్టేనని హర్షం వ్యక్తం అవుతోంది.

To Top

Send this to a friend