డీజీపీ గారు చర్యలు తీసుకోండి


సామాన్యల ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ వేగంగా స్పందిస్తున్నారు.. అక్కడక్కడా జరుగుతున్నా అన్యాయాలు, అక్రమాలు తన దృష్టికి వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మంగళవారం జరిగింది..

ఉప్పల్ నల్లచెరువు ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఓ చిరు వ్యాపారి అక్కడ తర్భూజలు అమ్ముతూ రోడ్డు వెంట పొట్టపోసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చిన ఓ ట్రాఫిక్ పోలీస్ ఆ చిరువ్యాపారిపై దాడి చేశాడు. పోలీసుల దాడి ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. ఇది వైరల్ లా వ్యాపించింది..

ఓ వ్యక్తి ఆ దృశ్యాలను ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ కు లింక్ పెట్టారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సదురు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాల్సిన అవసరముందని తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.

To Top

Send this to a friend