దేవుడి సొమ్ము పంచుతారా.?


ఏపీ ప్రభుత్వానికి ఇదో పెద్ద షాక్.. దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతూ రోజూ కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను వాడేసుకుందామనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దేవుడి సొమ్మును ఇలా పప్పూ బెల్లాల్ల మీ ఇష్టమున్న వ్యక్తులకు ప్రచారం మేర కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నిధుల విడుదలను రద్దు చేసింది.

ఏపీ ప్రభుత్వం టీటీడీ నుంచి ప్రైవేటు ట్రస్టులకు నెలకు రూ.50 లక్షల చొప్పున కేటాయించాలని జీవోను జారీ చేసింది. దీని ప్రకారం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు ప్రతినెల రూ.50 లక్షల రూపాయలు కేటాయించాలి. ఈ టీటీడీ నిధుల కేటాయింపు వివాదాస్పదం అయ్యింది. దేవుడి నిధులను ఇలా ఎలా పంచుతారని విమర్శలు వచ్చాయి. తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి హైకోర్టులో దీన్ని వ్యతిరేకిస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పూర్తి వివరాలు సమర్పించాలంటూ ఏపీ రెవెన్యూ కార్యదర్శికి, టీటీడీ ఈవోకు నోటీసులు జారీ చేసింది..

ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి టీటీడీపై కన్ను పడింది. ప్రతిరోజు కోట్ల రూపాయల ధనం దేవుడి పేరుతో వచ్చిపడడంతో ఎలాగైనా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందుకే మొదట ప్రైవేటు ట్రస్టులకు అక్రమంగా 50 లక్షల నిధులు కేటాయించడాన్ని హైకోర్టు రద్దు చేసింది. దీంతో ప్రభుత్వ ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. మున్ముందు టీటీడీ ధనంపై పాలకులు ఈ తీర్పు చెంపపెట్టులాంటిది..

To Top

Send this to a friend