దేశంలోనే అత్యధిక కలెక్షన్లు


టికెట్ల కోసం భారీ క్యూలు, వారానికి సరిపడా టికెట్లన్నీ అప్పుడే బుక్ అయిపోయాయి. దేశంలో ఏ సినిమాకు రానంత క్రేజ్ బాహుబలికి వచ్చేసింది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 9000 తెరలపై ప్రదర్శించారు. మనదేశంలో 6500 థియేటర్లలో బాహుబలి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ప్రధాన మల్టిపెక్స్ లలో అన్ని తెరలపై బాహుబలినే ప్రదర్శిస్తున్నారు.

బాహుబలికి జనం వరద మొదలైంది. తెలుగు రాష్ట్రంలో అన్నీ హౌస్ ఫుల్ షోలు కాగా బాలీవుడ్ లో ఏ సినిమాకు రానంత ఆదరణ బాహుబలికి వచ్చింది. హిందీలో ఈ సినిమా థియేటర్లలో హాజరు 96శాతంగా నమోదైంది. ఇంతలా గడిచిన పదేళ్లలో ఏ సినిమాకు ప్రేక్షకులు ఇంతలా హాజరు కాలేదట..

బాహుబలి విడుదలైన మొదటి రోజే దాదాపు 100 కోట్లు వసూలు చేసిందని టాక్.. విదేశాల్లో కలుపుకుంటే సినిమా తొలిరోజే 200 కోట్లు దాకా వసూల చేసిందని బిజినెస్ అనలిస్ట్ లు చెబుతున్నారు.. కొద్దిరోజులు తిరిగే సరికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని సినీ క్రిటిక్స్ ఘంటా పదంగా చెబుతున్నారు. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలు పీకే, దంగల్, సుల్తాన్ ల రికార్డులను బాహుబలి బద్దలు కొట్టడం ఖాయమని సినీ క్రిటిక్ కోమల్ నహత పేర్కొన్నారు. ఇదే జరిగితే భారత దేశ సినీ చరిత్రలోనే 1000 కోట్లు సాధించిన తొలిసినిమాగా బాహుబలి చరిత్రకెక్కడం ఖాయం..

కాగా బాహుబలి2ను అద్భుతంగా తీసిన రాజమౌళి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మనతరంలో జీనియస్ లాంటి దర్శకుడు రాజమౌళి మాత్రమేనని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కరుణ్ జోహర్ అభినందించారు. రాజమౌళి భారతీయ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లారని హీరో ఎన్టీఆర్ కీర్తించారు. రాజమౌళి ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడింకా పుట్టలేదని హీరో నాని తన అభిమానాన్ని చాటుకున్నారు. బాహుబలి చూశాక నేను డైరెక్షర్ అన్న భావన కలగడం లేదని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండాలనిపిస్తోందన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఇలా అందరూ బాహుబలిని వేయినోళ్ల పొగిడిన వారే.. 15 రోజులు గడిచే సరికల్లా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2000 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించే అవకాశాలున్నాయని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

To Top

Send this to a friend