దావూద్.. కుక్కచావుకు దగ్గరగా..

దావూద్ ఇబ్రహీం.. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి.. వందల మందిని చంపిన నరహంతకుడు.. ముంబై బాంబు పేలుళ్ల అనంతరం దేశం విడిచి పాకిస్తాన్ లోని కరాచీలో దాక్కొన్న ఈ మాఫియా డాన్ అనంతరం అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా మాఫియాను నడిపించి అన్ని దేశాలకు వణుకు పుట్టించాడు.. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్ అతడిని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దావూద్ మంది మార్బలం, డబ్బుతో పాకిస్తాన్ నాయకులను ప్రభావితం చేసి దొరక్కుండా తప్పించుకున్నాడు..

కానీ 60 ఏళ్లకు దగ్గరవుతున్న ఈ మాఫియా డాన్ చివరి అంకం లో కుక్కచావుకు దగ్గరయ్యాడు. జీవిత చరమాంకంలో చేసిన పాపాలకు తగిన శాస్తి జరుగుతోంది.. దావూద్ ఆరోగ్యం విషమించింది. షుగర్, బీపీ పెరిగిపోయి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట.. దీన్ని తొలగించేందుకు వైద్యులు ఆపరేషన్ చేయగా.. అది విఫలమైనట్టు సమాచారం. దీంతో అతడికి వెంటీలేటర్ పై చికిత్స చేస్తున్నట్టు సమాచారం.  శరీరానికి పక్షవాతం కూడా వచ్చిందట.. కుడివైపు శరీరం కూడా చచ్చుబడిపోయిందని ఓ పాకిస్తాన్ వార్త సంస్థ తెలిపింది.

ప్రస్తుతం పాకిస్తాన్ లోని కరాచీ ఆస్పత్రిలో అత్యత్తుమ భద్రత మధ్య ఉన్న దావూద్ కు పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తున్నారట.. ప్రాణం కాపాడడం సాధ్యం కాదని తేల్చిచెప్పారట.. దీంతో చేసిన పాపాలకు కుక్కచావు చస్తున్నాడని పలువురు విమర్శిస్తున్నారు.

To Top

Send this to a friend