అధికారిక లాంచనాలతో దాసరి అంత్యక్రియలు


దాసరి నారాయణ రావు మృతిని తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారే కాకుండా సాదారణ ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నో అద్బుత సినిమాలను అందించిన దాసరి నారాయణ రావు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. దాసరి మరణంకు నిరసనగా టాలీవుడ్‌ నేడు బంద్‌ను ప్రకటించిన విషయం తెల్సిందే. నిన్న సాయంత్రం దాసరి మరణించినప్పటి నుండి నేడు సాయత్రం నాలుగు గంటల వరకు లక్షలాది మంది ఆయన పార్థీవ దేహంను చూసేందుకు క్యూలు కడుతున్నారు.

అనారోగ్య కారణంగా చనిపోయిన దాసరి పార్ధీవ దేహాన్ని ఎక్కువ సమయం ఉంచడం మంచిది కాదని వైధ్యులు సూచించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరియు దాసరి సన్నిహితులు నేడు సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియు పూర్తి చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ స్థాయిని పెంచడంతో పాటు కేంద్ర మంత్రిగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చిన దాసరి నారాయణ రావుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దాసరికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళ్లు అర్పించారు.

To Top

Send this to a friend