సంతాపలెందుకు అనుకుంటున్నారు..?


మనిషి బతుకున్నంత సేపే వాల్యూ.. పోయాక విలువలు, మర్యాదలు, గుర్తులు, సహాయాలు , మేళ్లు ఏవీ గుర్తుండవు.. డబ్బు ఆశలో పడి సమాజంలో కృతజ్ఞతలు మరిచిపోతున్నారు. అవును నిజమే.. ఇప్పుడు దాసరి మరణించి వారం గడిచింది. అయినా ఆయన సంతాప సభలు నిర్వహించేందుకు ఆయనచే లైఫ్ పొందిన.. సాయం పొందిన నిర్మాతలు, దర్శకులు, నటులు చొరవ చూపకపోవడం విస్మయం కలిగిస్తోంది.

తెలుగు సినీ ఆకాశంలో దాసరి ఓ మేరునఘం.. ఆయన ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటులు, ఇతర టెక్నీషియన్లకు జీవితాన్నిచ్చారు. కానీ ఆయన మరణించినప్పుడు వారెవ్వరూ కనిపించలేదు. 25 కోట్ల అప్పు పొందిన నిర్మాత అయితే ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ డబ్బును ఎగ్గొట్టినట్టే లెక్కా.. పోనీ కనీసం సంతాప సభ అయినా తెలుగు సినిమా పరిశ్రమ తరఫున నిర్వహిస్తారనుకుంటే అదీ లేదు. దాసరికి ఘన నివాళులర్పిద్దామంటే ఎవరూ ముందుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది..

దాసరి సంతాప సభ నిర్వహించకపోవడానికి తెలుగు సినీ ప్రముఖులు చెప్పే కారణం ఒక్కటే.. ప్రస్తుతం తెలుగు సినిమాలోని మెజార్టీ ప్రముఖులు ప్రస్తుతం అందుబాటులో లేరట.. దాసరితో కలిసి సినిమాల్లో నటించిన చిరంజీవితో పాటు 80ల నాటి స్టార్స్ చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారు. ఓ పార్టీలో పాల్గొనేందుకు వారంతా వెళ్లారట.. అందుకే వారు వచ్చాక సంతాప సభ నిర్వహిస్తామని టాలీవుడ్ నిర్మాత సీ.కల్యాణ్ తెలిపారు.

తెలుగు సినిమాకు జీవితం ధారపోసి ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన దాసరిని తెలుగు సినిమా పరిశ్రమ సరైన గుర్తింపునివ్వడం లేదనడానికి ఇదో పెద్ద ఉదాహరణ.. సంతాప సభను నిర్వహణకు ఎవరూ అందుబాటులో లేకపోవడం విస్తుగొలుపుతోంది. తెలంగాణకు చెందిన వ్యక్తి కాకున్నా తెలంగాణ ఫిలించాంబర్, ప్రభుత్వం తరఫున మంత్రి తుమ్మల పాల్గొని నిన్న దాసరి సంతాప సభను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇది చూసైనా ఆంధ్ర నేతలు, ఆ ప్రాంత నటులు, టాలీవుడ్ పరిశ్రమ బుద్ది తెచ్చుకుంటే మంచిది.

To Top

Send this to a friend