బయటకు వెళ్తే మరణమే?

కొత్తగూడెంలో 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత.., విజయవాడలో 46.2, బాపట్లలో 46.3 డిగ్రీలు ఇలా తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సాధారణం కంటే రెండు నుంచి 5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉండవచ్చని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది.

బుధవారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కర్ఫూ వాతావరణమే కనిపించింది. ముఖ్యంగా వడగాల్పులు విజృంభిస్తున్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

గడిచిన మార్చి నుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 200 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం పూట ఎండల్లో తిరగరాదని.. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తలపై టోపీ ధరించి.. తెల్లని నూలు బట్లు ధరిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

కాగా ఇది పెళ్లిళ్ల సీజన్.. మే 31వరకు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అందుకని పిల్లలను పెళ్లిళ్ల సందడిలో పడి మరిచిపోతే వారు ఎండలకు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీళ్తు, ఇతర ద్రవపదార్థాలు ముఖ్యంగా నిమ్మరసం కలిపిన నీళ్లని పిల్లలకు తాగిస్తే వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చు.

To Top

Send this to a friend