అంత డబ్బా.. బాప్ రే..

తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ పన్నీర్ సెల్వంకు కొందరు, శశికళకు కొందరు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మద్దతు ప్రక్రియలో శశికళనే పైచేయి సాధించింది. మరి శశికళ ఎమ్మెల్యే కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్ము చెబితే కళ్లు బైర్లకమ్మాల్సిందే..

పన్నీర్ సెల్వంను గద్దె దింపి తాను గద్దెనెక్కేందుకు చిన్నమ్మ శశికల సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.6కోట్లు  ముట్టజెప్పినట్టు సమాచారం. పెద్ద నోట్ల రద్దుతో నోట్లకు కటకట ఏర్పడడంతో కొంత మొత్తాన్ని బంగారం రూపంలో ఎమ్మెల్యేలకు శశికళ ఇచ్చిందట.. ఇందుకోసం దాదాపు 1000 కోట్లు శశికళ సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకే ఎమ్మెల్యేలందరూ ఇళ్లూ, వాకిలి వదిలి శశికళతో కలిసి రిసార్ట్ లో 15రోజులు అజ్ఞాతవాసం గడిపారు.

తమిళచానళ్లు, ఓ ఆంగ్ల చానల్ కలిసి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ లో శశికళ ఎంత డబ్బు పంచింది… ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంసృష్టిస్తున్నాయి. ఇక ప్రభుత్వాన్ని కూల్చేందుకు పన్నీర్ సెల్వం కూడా తక్కువేం ఖర్చు పెట్టలేదట.. పన్నీర్ కూడా తలా 2 నుంచి 3 కోట్ల వరకు ముట్టచెప్పడానికి హామీ ఇచ్చినా ఆయన వర్గంలో ఎవరూ చేరలేదు. ఇలా శశికళ అధికారం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టడం.. అంత స్టామినా కలిగి ఉండడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

To Top

Send this to a friend