రానా షోపై ముందే విమర్శలు


బుల్లి తెరపైకి స్టార్స్‌ వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవిలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ద్వారా బుల్లి తెరపై కనిపించగా త్వరలోనే ఎన్టీఆర్‌ మరియు రానాలు బుల్లి తెరపై మెరిసేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్టీఆర్‌ కంటే ముందుగా రానా ‘నెం.1 యారి విత్‌ రానా’ అనే సెలబ్రెటీ టాక్‌ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే షోకు సంబంధించిన రెండు మూడు ఎపిసోడ్‌ల చిత్రీకరణ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.

మొదటి ఎపిసోడ్‌లో సుమంత్‌ మరియు నాగచైతన్యలతో రానా టాక్‌ షో ఉండబోతుంది. ఆ తర్వాత అఖిల్‌ మరియు రాజమౌళి తనయుడు కార్తికేయతో రానా రాబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రదీప్‌ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా కార్యక్రమంకు కాస్త అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసి రానా ఈ షోను తీసుకు రాబోతున్నట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రానాకు ఉన్న పరిచయాలతో యువ హీరోలను, స్టార్స్‌ను వరుసగా తీసుకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఆ షో ఎంత వరకు ప్రేక్షకుల ఆధరణ పొందుతుంది అనే విషయంలో మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు రానా హీరోగా తెరకెక్కిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌గా నటించింది.

To Top

Send this to a friend