అందరికీ క్రెడిట్ కార్డులు.. దీనికోసం..

ఎలాంటి వడ్డీ లేకుండా ఉన్నత ఉద్యోగులకు ఇన్నాళ్లు క్రెడిట్ కార్డులు ఆపన్న హస్తంలా నిలిచాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత డబ్బుల కొరత నేపథ్యంలో క్రెడిట్ కార్డులు బంగారంలా మారాయి. ఈ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది.. ఎలాంటి వడ్డీ లేకుండా అప్పులిచ్చే క్రెడిట్ కార్డులపై క్రేజ్ నెలకొంది. క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఉన్నత ఉద్యోగులు, బడా బాబులకే ఉండేవి. ఇక నుంచి పేదలు, మధ్యతరగతి వారికి కూడా ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి.

దాదాపు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా ఈ క్రెడిట్ కార్డులను వాడుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రబ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకులు బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్ లో 20000 డిపాజిట్ ఉంచితే చాలు వారికి అందులో 80శాతం వినియోగించుకునేలా క్రెడిట్ కార్డును ఇవ్వాలని నిర్ణయించాయి. దీనికోసం ఎవ్వరైనా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డు పొందవచ్చు.

పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఊరటనిచ్చేలా చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ఆన్ లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి. పేటీఎం, ఫోన్ పే లాంటి చెల్లింపు యాప్ లు దూసుకొచ్చాయి. ప్రజల్లో ఉన్న నగదు కొరతకు ఊరటినిచ్చేలా ఇలా చాలా అవకాశాలను ప్రభుత్వం, బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఇది బ్యాంకు ఖాతాదారులకు ఊరటనిచ్చే విషయం.

To Top

Send this to a friend