కేసీఆర్ రైట్ హ్యాండ్ కు అవినీతి మకిలి..

ఇప్పుడు టీఆర్ఎస్ లో నంబర్ 2 వ్యక్తి.. కేసీఆర్ తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న నేత.. ఏ సమావేశంలోనైనా కేసీఆర్ పక్కనే కూర్చునే సీనియర్ కే. కేశవరావుకు కష్టాలు వచ్చిపడ్డాయి. హైదరాబాద్ లోని ఇబ్రహీం పట్నం దండు మైలారంలో కేకే కుమార్తె, కేకే కలిసి ఓ 50 ఎకరాల భూమిని కొన్నారు. అందులో 38 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసి కేకేకు తక్కువ ధరకు కట్టబెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గోల్డ్ స్టోన్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఘాంసియాగూడ, దండుమైలారంలో పలువురిని బెదిరించి వందల ఎకరాల కబ్జా చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భూ కుంభకోణంలోనే ఇటీవల పలువురు రిజిస్ట్రార్ లు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు. ఆ భూ కబ్జా నుంచి బయటపడేందుకు సదురు గోల్డ్ స్టోన్ సంస్థ .. టీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు కేకేకు 50 ఎకరాలను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. కబ్జా చేసిన భూమి అని తెలుసో తెలియదో కానీ కేకే కుటుంబం ఆ 50 ఎకరాల భూమిని కొని ఇరుకున పడింది..

ఇప్పుడు ఈ కబ్జా భూమిని కొన్న కేకే వార్తల్లో నిలిచారు. ఆయన కుమార్తె విజయలక్ష్మీ టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉండడం.. కేకే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ గా ఉండడంతో ఈ వ్యవహారం టీఆర్ఎస్ ను అప్రతిష్ట పాలు చేసింది. టీఆర్ఎస్ నేత అధికార బలంతో భూమిని కబ్జా చేసుకున్నారని అన్ని మీడియాల్లో పతాక శీర్షికన వచ్చింది. దీంతో టీఆర్ఎస్ పరువుపోయింది. కేకే మాత్రం ఇది కబ్జా భూమిని తమకు తెలియదని.. కొనుగోలు చేశాక తెలిసిందని చెప్పడం కొసమెరుపు. కానీ తక్కువకు వచ్చింది కదా అని కొనుగోలు చేస్తే ఎంత ఉపద్రవాలు ఎదురవుతాయో ఇప్పుడు కేకే తెలిసివచ్చింది.

To Top

Send this to a friend