కార్పొరేట్ పోలీస్ స్పైడర్


ఎట్టకేలకు.. ఎన్నో నిరీక్షణల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైనా ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాన్ని రిలీవ్ చేయలేదు. కానీ ఎట్టకేలకు మహేశ్ సినిమా పేరును ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

స్పైడర్ టైటిల్ గా మహేశ్ మూవీ రాబోతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలారోజులుగా జరుగుతున్న ఒక్క వార్త బయటకు రాకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ చాలా కాలంగా మదనపడుతున్నారు. బుధవారం ఫస్ట్ లుక్ లో మహేశ్ కార్పొరేట్ పోలీస్ తరహాలో గన్ తో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు ఎస్. జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. జూన్ 23న సినిమాను రిలీజ్ చేయనున్నారు.

మహేశ్ బాబు స్పైడర్ ఫస్ట్ లుక్ ను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend