పాల్వయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ , రెబల్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మిక మరణం పొందారు. గుండెపోటుతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1936 నవంబర్ 20న మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నందంపల్లి గ్రామంలో పాల్వాయి జన్మించారు. పాల్వయి మరణంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వచ్చి ఆరాతీశారు.

ప్రస్తుతం పాల్వయి గోవర్ధన్ రెడ్డి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అందులో భాగంగా కులుమనాలిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఉండగానే శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.

1967లో తొలిసారి పాల్వాయి ఎమ్మెల్యేగా గెలిచారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 2012లో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికై కొనసాగుతున్నారు. పాల్వాయికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కులుమనాలి నుంచి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

To Top

Send this to a friend