కేసీఆర్ ప్లాన్.. కాంగ్రెస్ ఖతమేనా.?

ఈసారి సంవృద్ధిగా వానలు పడడం లేదు.. పడ్డ వానలు కూడా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు ప్రాజెక్టులు నింపి కిందకు నీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చుక్క నీరు రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును నింపేందుకు గోదావరిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి ఎత్తిపోతల ద్వారా శ్రీరాంసాగర్ ను నింపేందుకు కేసీఆర్ నడుం బిగించారు. ప్రాణహిత నది, ఆదిలాబాద్ లో వర్షాల వల్ల ఎల్లంపల్లి నిండిపోతోంది. దీంతో ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ కు నీటిని పంపింగ్ చేసేందుకు దాదాపు 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ నెలాఖరులోనే దీనికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

ఇక కాంగ్రెస్ కపట నాటకాన్ని బయటపెడతానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంగ్రెస్ తెలంగాణపై చేస్తున్న కుట్రలను పల్లె పల్లెకు తిరిగి వివరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి ముహూర్తం ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్ లోనూ భయం వెంటాడుతోంది..

ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటోందని.. ప్రాజెక్టులు కట్టకుండా.. సింగరేణి, విద్యుత్, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా హైకోర్టులో కేసులు వేస్తోందని కేసీఆర్ నిన్న విలేకరుల సమావేశంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.. వీటిని ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ స్వయంగా తెలంగాణ అంతటా తిరుగుతానని స్పష్టం చేయడంతో కాంగ్రెస్-టీఆర్ఎస్ వార్ మొదలైంది. కేసీఆర్ దూకుడు ముందు కాంగ్రెస్ నాయకులు నిలబెడతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019 ఎన్నికలకు ముందుగానే 2018లో ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు రావడంతోనే కేసీఆర్ ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

To Top

Send this to a friend