ఫేస్ బుక్ లో దేవుడిపై కామెంట్, మరణశిక్ష విధింపు


పాకిస్తాన్ లో మత చాందసవాదం ఎక్కువ. వారి మతాన్ని ఎవ్వరూ కించపరిచినా ఉరుకోరు. పవిత్రయుద్ధం పేరుతో ఇతర దేశాలపై పాక్ ఉగ్రవాదులు ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు. అంతటి మతపరమైన దేశంలో ఆ దేశానికే చెందిన ముస్లిం ఫేస్ బుక్ లో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద సందేశాన్ని పోస్ట్ చేశాడు.

పాకిస్తాన్ లో మైనార్టీలైన షియా వర్గానికి చెందిన లాహోర్ నివాసి తైమూర్ రజా అనే వ్యక్తి ఫేస్ బుక్ లో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద సందేశాన్ని పోస్టు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా.. కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.

పాక్ లో దైవ దూషణను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఉగ్రవాదం కంటే కూడా దైవ దూషణనే ఎక్కువ తప్పుపడతారు. ఈ నేపథ్యంలోనే రజా మహ్మద్ ప్రవక్త భార్య, సహచరులను ఉద్దేశించి ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేయగా.. కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. దీంతో దేవుడిని తిట్టినందుకు అతడు ఉరికంబం ఎక్కబోతున్నాడు.
అదే ఇండియాలో ఇదే పనిచేస్తే జరిమానా లేదంటే సాధారణంగా ఒక నెల రోజులు మాత్రమే శిక్ష పడుతుంది. పాకిస్తాన్ చట్టాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.

To Top

Send this to a friend