కొబ్బరినూనెతో గుండెపోటు, పక్షవాతం..

కొబ్బరి నూనెను తెలుగు రాష్ట్రాల్లో అయితే జుట్టుకే రాసుకుంటాం. కానీ కొందరు వంటల్లో కూడా వాడతారు.. కేరళలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కొబ్బరినూనెతో అక్కడి వారు వంటలు చేసుకొని తింటారు. కానీ ఈ కొబ్బరి నూనె చాలా ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. ఇది వంటల్లో వాడితే గుండపోటుతో పాటు పక్షవాతం వస్తుందని తేల్చారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన పరిశోధనల్లో కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉన్నాయని తేలింది. దాదాపు 82 శాతం సంతృప్త కొవ్వులు కొబ్బరినూనెలో ఉన్నాయని పరిశోధనల్లో తేల్చారు. సంతృప్తి కొవ్వులు ఎక్కువగా ఉన్న కొబ్బరి నూనెను మనం తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ధమనుల్లో రక్త సరఫరాకు అవరోధం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వస్తుంది.

పరిశోధన చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు.. ఆహారం తీసుకునే విషయంలో కొబ్బరి నూనె కంటే సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే పొద్దు తిరుగుడు, ఆలివ్ ఆయిల్ బెటర్ అని సూచిస్తున్నారు .. వెన్న (63శాతం), గోమాంసం (50శాతం) కంటే కూడా కొబ్బరినూనేలోనే కొవ్వు ఎక్కువ.. దీన్ని గనుక వంటల్లో వాడితే మనిషుల్లో గుండెపోటు, పక్షవాతం రావడం ఖాయమని పరిశోధకులు తేల్చారు.

కొబ్బరినూనె వల్ల గుండెపోటు, పక్షవాతం వస్తుందని తేలడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు ఇది తెలియక  కేరళ వాసులు తెగవాడేశారు. ఇప్పుడు ఆ నూనెను తగ్గించే పనిలో పడ్డారట.. తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరినూనెను వంటల్లో వాడరు. కొవ్వు తక్కువగా ఉండే పొద్దుతిరుగుడునే ఎక్కువగా వాడతారు. కొంత మంది పల్లినూనెను వాడతారు. కొబ్బరినూనెతో పోల్చితే పొద్దుతిరుగుడు నూనె గుండెకు, పక్షవాతం రాకుండా మంచిదని తేలింది.

To Top

Send this to a friend