దిల్ రాజు, శేఖర్ కమ్ములకు కేసీఆర్ అభినందన

తెలంగాణ యాస, భాసను అద్భుతంగా తెరపై చూపించిన సినిమా ఫిదా. వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందించిన ఫిదా మూవీ ఈనెల 21న రిలీజ్ అయ్యింది. స్వతంత్ర భావాలున్న తెలంగాణ యువతి భానుమతి పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయి తెలంగాణ యాసను అద్భుతంగా పలకింది. ఇక ఎన్నారై యువకుడు వరుణ్ తేజ్ -సాయిపల్లవి మధ్య ప్రేమకథను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరపై చక్కగా చూపించాడు.

నిన్న రాత్రి కేసీఆర్ తన నివాసంలోని మినీ థియేటర్ లో కుటుంబంతో కలిసి ఫిదా సినిమాను తిలకించారు. అనంతరం బాగుందని దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి అభినందించారు. తెలంగాణ యాసతో సాయిపల్లవి నటనకు కేసీఆర్ ఫిదా అయ్యారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజుతో ఫోన్ లో మాట్లాడి అద్భుత చిత్రాన్ని తీశారని కొనియాడారు.

మిషన్ కాకతీయ వంటి పథకాల వల్ల తెలంగాణ పచ్చదనం అలుముకుందని.. బీళ్లన్ని పొలాలుగా మారి కోనసీమను తలదన్నేలా తెలంగాణ తయారైందని.. తెలంగాణ ఇంత అద్భుతంగా ఉంటుందా అని ప్రపంచానికి ఫిదా సినిమా ద్వారా చూపించిన దర్శకుడు, నిర్మాతను సీఎం కేసీఆర్ అభినందనలతో ముంచెత్తినట్టు సమాచారం. ఈ ఫిదా సినిమా షూటింగ్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి గ్రామంలో తెరకెక్కింది. ఆ గ్రామ అందాలు తెరపై అద్భుతంగా వచ్చాయని కేసీఆర్ కొనియాడారు.

To Top

Send this to a friend