ఆ ఒక్కటి కీలకం.. అందుకే కలిశారు..


ఫైట్లు చేసుకుంటారు. నీటికోసం ఎంతదాకైనా వెళతారు.. రాష్ట్రాల మధ్యల సమస్యలపై దుమ్మెత్తిపోసుకుంటారు.. కానీ ఒక్క విషయంలో మాత్రం కలిసిపోయారు.. ఇద్దరు చంద్రుల రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించే ఆ విషయంలో తమ భేదాబిప్రాయాలు పక్కనపెట్టి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది..

ఓటుకు నోటు కేసు చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య దూరాన్ని పెంచింది. అమరావతి నగర శంకుస్థాపన వారిద్దరిని కలిపింది. కేసీఆర్ చండీయాగం విభేదాలన్నింటిని పక్కనపెట్టింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య అడపాదడపా తిట్టుకుంటూనే ఉంటున్నారు. ఇంత ఉప్పునిప్పులా ప్రచ్చన్న యుద్దం చేసుకుంటున్న ఇద్దరు చంద్రులు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మాత్రం ఒక్కటిగా ఉద్యమించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం..

తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఇద్దరు సీఎంలు ప్రతిపక్షాలను బలహీనం చేసేందుకు ఇబ్బడిముబ్బడిగా నాయకులను లాగాయి. వారందరికీ సీట్లు ఇద్దామంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల కొరత ఉంది. దీంతోపాటు పాలన సౌలభ్యం దృష్ట్యా కొత్త నియోజకవర్గాల పెంపు అత్యవసరం. అందుకే ఇప్పుడు తమ రాజకీయ స్వాలభం కోసం ఇద్దరు సీఎంలు ఢిల్లీలో ఒక్కటయ్యారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా కోవింద్ నామినేషన్ కు హాజరైన కేసీఆర్, చంద్రబాబులు ఈ మేరకు కేంద్రంలోని ఆ ఫైల్ వేగంగా కదలాలని.. ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెడితే 2019 వరకు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం మోడీ, హోంశాఖపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం విభేదాలన్నింటిని పక్కన పెట్టి చంద్రులు కలుసుకోవడం చర్చనీయాంశమైంది.

To Top

Send this to a friend