సినిమాను సినిమాగా చూడండి ఫ్యాన్స్

ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం శుక్రవారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మేనియా అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. అయితే సినిమా అంటే పడి చచ్చే కోస్తాతీరంలో అప్పుడే ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అభిమాన సంఘాల మధ్య చెలరేగిన చిచ్చు ఉద్రిక్తతలకు దారితీసింది..

రెండేళ్ల కిందట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందురోజు రాత్రి భారీ ఫ్లెక్సీలు, కటౌట్ లు ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు, కటౌట్ లను రాత్రి తగులబెట్టారు. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. కొందరు అనుమానిత వైరి వర్గం ఫ్యాన్స్ ఇళ్లపై, వారిపై దాడి చేశారు. ఈ ఫ్లెక్సీల వివాదంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో అప్పటి ఘర్షణను బేస్ చేసుకొని పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారట.. అభిమానుల మధ్య తలెత్తిన ఘర్షణ రెండు కులాల వైరంగా మారి ప్రస్తుతం బాహుబలి రిలీజ్ వేళ మరోసారి రాజుకుంది. గొడవలు జరుగుతాయని భావించిన పోలీసులు ప్రస్తుతం భీమవరంలో 144 సెక్షన్ విధించారు. ముందస్తుగా పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇరు అభిమాన సంఘాలు సహకరించాలని పోలీసులు సూచించారట.. గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారట.. సినిమాను సినిమాగా చూడాలని .. ఇలా అభిమానం హద్దులు దాటి కొట్టుకోవద్దని స్పష్టం చేశారట..

To Top

Send this to a friend