ఉయ్యాలవాడ కోసం చిరంజీవి సాహసం..


అన్ని కుదిరాయి.. ఒక్క సంగీతం తప్ప.. దేవీ శ్రీ ప్రసాద్ బాగానే చేస్తాడు. కానీ ఈ యూత్ రాక్ స్టార్ బాణీలు మెలోడీ, లవ్, ఎంటర్ టైనర్ కు సరిపోతాయి. చారిత్రక కథాంశాలకు సీనియర్లు కావాలి. కీరవాణీ లాంటి వాళ్లు పనిచేయాలి. అంతకుమించి అనుకున్నారు చిరంజీవి. తన 151వ సినిమా ఉయ్యాలవాడ కోసం ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడితో సంగీతం చేయించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

మెగాస్టార్ చిరు, ఆయన తనయుడు, నిర్మాత రాంచరణ్ లు ఉయ్యాలవాడ సినిమాకోసం పనిచేయాలని ఆస్కార్ విజేత.. సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ ను సంప్రదించారని తెలిసింది. ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా స్వయంగా చైన్నై వెళ్లి రెహమాన్ ను కలిసినట్టు సమాచారం. అయితే చిరు ఉయ్యాలవాడ సినిమాకోసం పనిచేయడానికి రెహమాన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇయ్యనట్టు తెలిసింది. ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఒక వేళ రెహమాన్ ఒప్పుకోకపోతే.. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్, లేదా కీరవాణి ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి.

చిరంజీవి తన 151వ చిత్రంగా తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకున్నారు. బాహుబలి రిలీజ్ అయ్యాక ఈ చారిత్రక కథలకు డిమాండ్ పెరిగింది. దేశవ్యాప్తంగా రిలీజ్ చేసి పేరుతో పాటు డబ్బు ఆర్జించవచ్చని దర్శకులు, హీరోలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే చిరు ఉయ్యాలవాడ తీసేందుకు ముందుకు వచ్చారు. ఇక ఉయ్యాలవాడ కథ విషయానికి వస్తే.. దేశంలో 1857 కంటే ముందే నల్లమల అడవులను కేంద్రంగా చేసుకొని బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథ.. ఈ చరిత్రకు రచయితలు పరిచూరి బ్రదర్స్, దర్శకుడు సురేందర్ రెడ్డి కలిసి తుది కసరత్తులు చేస్తున్నారు.

To Top

Send this to a friend