సైరా విషయానికి వస్తే ముందుగా రాంచరణ్ ని మెచ్ఛుకోవాలి.చరిత్ర పుటలలో కలిసిపోయిన ఒక మహనీయుని జీవిత కధను తెరకెక్కించటం మాటలా…..సైరా చిరంజీవి తన12ఏళ్ళకల.అలాంటి కధను స్వాతంత్ర్యం విలువ మరచిపోతున్న ఈ తరానికి ఖచ్చితంగా చూపించాలి.దర్శకుడు ప్రధమార్థంలో పాత్రల పరిచయానికే ఎక్కువ టైం తీసుకున్నాడు దానితో అక్కడక్కడ డాక్యుమెంటరీ ఫీలింగ్ మనకు వస్తుంది. ద్వితీయార్థంలో డైరెక్టర్ ఆ ఛాన్స్ మనకి ఇవ్వడు.చివరి వరకు చాలా బాగుంది. సేతుపతి,సుదీప్ నటన మైండ్ బ్లోయింగ్.నయనతార కన్నా తమన్నా పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఆవురావుర మంటున్న అభిమానులకు సైరా అసలైన దసరా పండగ. చిరంజీవి నరసింహరెడ్డి పాత్రలో జీవించాడు.ఈమూవీకీ రేటింగ్ ఇవ్వడం కరక్ట్ కాదు
