చిరు ‘ఉయ్యాలవాడ’కు వేళయ్యింది..

మరో చారిత్రక గాథ తెరపై చూపించే ప్రయత్నం మొదలవబోతోంది.. తెలుగులో బాహుబలి ప్రభంజనంతో మొదలైన ఈ ఒరవడిని చిరంజీవి కూడా కొనసాగించేందుకు రెడీ అయ్యారు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక తన 151వ చిత్రంగా చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నారు. చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి’ కథను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడీ కథా సిద్ధమై ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి.. పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నారు.

చిరు ఉయ్యాలవాడ సినిమా ను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న లాంచ్ చేయాలని మొదట నిర్మాత రాంచరణ్ నిర్ణయించారు. కానీ ఉయ్యాలవాడ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తే క్రేజ్ వస్తుందని చిరంజీవి, రాంచరణ్ డిసైడ్ అయినట్టు తెలిసింది.

కాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎవరనే దానిపై మరో వార్త బయటకు వచ్చింది. ఉయ్యాలవాడ సినిమాలో హీరోయిన్ గా నయనతార ఎంపికైందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఐశ్వర్యరాయ్, ఆ తరువాత అనుష్క అనుకున్నారు. ఇప్పుడు చిరంజీవి ఏజ్ గ్రూప్ కు తగ్గట్టు సీనియర్ అయిన నయనతారను ఎంపిక చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఆగస్టులోనే ఉయ్యాలవాడ సినిమాను మొదలు పెట్టాలని చిరంజీవి పట్టుదలగా ఉన్నారు. ఉయ్యాలవాడ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ రూపుదిద్దుకుంటోంది.. ప్రస్తుతం చిరంజీవి భార్యతో కలిసి ఫారెన్ టూర్లలో ఉన్నారు. ఆయన పర్యటన ముగిసి హైదరాబాద్ వచ్చాక నిర్మాత రాంచరణ్ ఆగస్టు 15న సినిమాను అనౌన్స్ చేసే విషయంపై చిరంజీవితో చర్చించి మీడియాకు విషయం వెల్లడిస్తాడని సమాచారం.

To Top

Send this to a friend