బుల్లితెరపై స్టామినా చాటిన చిరు..


మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు. దాదాపు 9 ఏళ్లు యాక్టింగ్ కు దూరంగా ఉండి రీయింట్రీ ఇచ్చి నటించిన ఖైదీనంబర్ 150 మూవీ రికార్డు కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే.. దాదాపు 100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ చేసింది. దీంతో చిరు స్టామినా తగ్గలేదని రుజువైంది..

ఖైదీ నంబర్ 150 మూవీని ఈ ఆదివారం మాటీవీలో ప్రసారం చేశారు. ఇది టీఆర్పీ రేటింగ్ లోనే నంబర్ 1 గా నిలిచిందట.. ఈ సినిమా ప్రసారంతో అత్యధిక మంది చూశారు. తెలుగు టీవీల్లో మాటీవీ టీఆర్పీలో మొదటిస్థానానికి చేరిందట..

మరో చానల్ జెమినీ ఐఫా అవార్డుల కార్యక్రమం ప్రసారమైనా కానీ జనం ఖైదీనంబర్ 150 మూవీని చూడడం విశేషం. అభిమానుల నుంచి విశేష స్పందన రావడంతో మాటీవీ యాజమాన్యం కూడా ఖైదీ సినిమా పాటలైన అమ్ముడు లెట్స్ కుమ్ముడు, రత్తాలు,.. రత్తాలు పాటలను రెండు సార్లు ప్రసారం చేయడం విశేషం.. ఒక సినిమా హీరో పాటలను ఇలా బుల్లితెరపై రెండు సార్లు ప్రసారం చేయడం విశేషమని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

To Top

Send this to a friend