చిరు ఉయ్యాలవాడ దొరికిపోయాడు..

చిరంజీవి సిద్ధమైతున్నాడు. తన తరువాతి సినిమా ఉయ్యాలవాడ కోసం రూపు, కండలు, మీసం, గడ్డం పెంచేసి ఠీవీగా తయారయ్యాడు. ఎక్కడా బయటకు రాని ఈ పిక్స్ ఢిల్లీలో బయటపడ్డాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సందర్భంగా పార్లమెంట్ ఆవరణ ఆహ్లాదకరంగా మారింది. ఓటు వేసేందుకు ఢిల్లీకి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఒకరినొకరు సరదాగా పలకరించుకున్నారు.

ఈ సందర్బంగా కలిసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత, రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం కవిత.. చిరంజీవితో సెల్ఫీదిగారు. కవితతో పాటు ఇతర ఎంపీలు కూడా చిరుతో సెల్ఫీలు దిగారు. కవిత ఈ సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. తన ఫేవరెట్ హీరో మెగాస్టార్ అని ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్ అంటూ ట్వీట్ చేసింది..

ఇలా కవిత తాను చిరంజీవి ఫ్యాన్ అని చెప్పకనే చెప్పేసింది. మరో వైపు చిరు ఉయ్యాలవాడలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్కంఠ కవిత ట్విట్టర్ లో పెట్టిన ఫొటోతో లీక్ అయిపోయింది. చిరంజీవి భారీ మీసం.. కోరమీసాలతో ఈ ఫొటోలో కనిపించాడు. దీంతో ఈ గెటప్ ఉయ్యాలవాడ కోసమే కావచ్చు అని అందరూ ఆసక్తిగా ఆ ఫొటోను షేర్లు చేస్తున్నారు.

To Top

Send this to a friend