చిక్కు వీడని ఆ ఒక్క ప్రశ్న.?


బాహుబలి2 మేనియా కొనసాగుతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయంపై ఉత్కంఠ వీడింది. రాజమౌళి సినిమాలో చెప్పిన కారణానికి జనం జై కొట్టారు. రికార్డు కలెక్షన్లు దక్కుతున్నాయి. అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం రాజమౌళి శేష ప్రశ్నలుగానే వదిలేశాడు. విమర్శకుల ప్రశ్నలకు రాజమౌళి సమాధానం ఇవ్వడం లేదు.
బాహుబలి మొదటి పార్ట్ లో బాహుబలి కొడుకు శివుడు.. భళ్లాల దేవుడు కొడుకు భద్రను తన కన్నతల్లిని చిత్రహింసలకు గురిచేస్తున్నందుకు పోరాటంలో భాగంగా హతమారుస్తాడు. దీంతో రగిలిపోతాడు భళ్లాల దేవుడు. ఆ కథ కొనసాగింపును రెండో పార్ట్ లో చూపించలేకపోయాడు రాజమౌళి..
రెండో పార్ట్ లో భళ్లాల దేవుడి పెళ్లి , అతడి భార్య , కొడుకు పాత్ర , పుట్టుక లేనే లేదు. భళ్లాలకు దేవసేన దక్కకపోవడంతో వేరేవాళ్లను పెళ్లి చేసుకొని భద్రను కన్నాడని ఒకరు.. లేదు.. భద్ర దత్త పుత్రుడనే కొత్త వాదన తెరపైకి వస్తోంది. అయితే భళ్లాల దేవుడు, అతడి పెళ్లి, కొడుకు భద్ర గురించి ఎక్కడా సినిమాలో చూపించకపోవడంతో ఇవీ శేష ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. రాజమౌళి ఇప్పటికైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అభిమానులు కోరుతున్నారు.

To Top

Send this to a friend