చిచ్చు పెడుతున్న నంద్యాల ఉపఎన్నిక


భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల శాసన సభ ఉప ఎన్నిక అటు తెలుగు దేశం పార్టీలో.. ఇటు భూమా నాగిరెడ్డి కుటుంబంలో చిచ్చు రేపుతోంది. నంద్యాల బరిలోకి దిగేందుకు అశావహుల సంఖ్యలో భారీగా ఉండడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇది సంకటంగా మారింది.

నంద్యాలలో గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డిపై పోటీచేసిన శిల్పా మోహన్ రెడ్డి, మరో నేత ఫరూక్ లు ఇప్పుడు టీడీపీ తరఫునే ఉన్నారు. వారు తమకు టికెట్ ఇచ్చి తీరాల్సిందేనని.. లేకపోతే వైసీపీ నుంచైనా.. లేదా ఇండిపెండెంట్ గా నైనా బరిలోకి దిగి ఓడిస్తామని బెదిరిస్తున్నారు. ఇక కర్నూలులో రాజకీయంగా బలంగా ఉన్న ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం కూడా తమకే నంద్యాల సీటు టికెట్ ఇవ్వాలని బాబును కోరుతోందట..

ఇక నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటుపై సర్వహక్కలు భూమా కుటుంబానికి ఉంటాయి. అనాధిగా వస్తున్న ఆచారం ఇది. ఈ నేపథ్యంలో భూమా అఖిల ప్రియ ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నంద్యాల నుంచి బరిలోకి దిగేందుకు వారి కుటుంబంలో ఆమె చెల్లెలు మౌనిక ఉన్నారు. కానీ ఆమె వయసు చిన్నది కావడం.. రాజకీయాలపై ఆమెకు అంతగా అవగాహన లేకపోవడం మైనస్ గా మారింది. ఇక కుమారుడు మరీ చిన్నోడు. అతడిని రాజకీయాల్లో రావడానికి వయసు సరిపోదు.

ఇలా భూమా కుటుంబంలో నిలబడడానికి అనిశ్చితి నెలకొనడంతో భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా బ్రహ్మానందారెడ్డి టికెట్ తమకు ఇవ్వాలని చంద్రబాబును కోరారట.. కానీ నాగిరెడ్డి కుటుంబం చెప్పిన వారికే టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి రెబెల్స్ బాధ తప్పేట్టు లేదు. అంతిమంగా ఇది వైసీపీకి లాభం చేకూర్చేవిధంగా ఉంది.

To Top

Send this to a friend