చెమట పట్టకుండా …


3 నెలలు, దొరికితే 30 రోజుల్లోనే సినిమా తీసే పూరిజగన్నాథ్ చేతుల్లో ప్రస్తుతం నందమూరి అందగాడు బాలయ్య పడ్డాడు. ఏ కథ చెప్పి ఒప్పించాడో తెలియదు కానీ పూరి-బాలయ్య కాంబినేషన్ పై అందరిలోనూ ఒక రకమైన భయం, ఆందోళన నెలకొంది. ఎప్పుడు లవ్, మాఫియా కథలు తీస్తూ అవే పాత చింతకాయ పచ్చడి కథనాన్ని ప్రజెంట్ చేస్తూ పూరి వరుస ప్లాపులు పొందాడు. మధ్యలో టెంపర్ వేరొకరి కథను తీసి హిట్ కొట్టిన ఇటీవల లోఫర్, రోగ్, ఇజం ప్లాపులు చూశాక.. పూరితో చేయాలంటేనే హీరోలు భయపడుతున్నారు..

అలాంటి పూరి ఇప్పుడు బాలయ్యకు కథ చెప్పడం.. ఆయన ఓకే అనడంతో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. విచిత్రమేంటంటే.. ఫస్ట్ షెడ్యూల్ ముగిసినా ఇంకా హీరోయిన్, నటీనటుల ఎంపిక పూర్తి కాలేదట.. సో ఇంత హరీబరీగా సినిమా తీస్తున్న పూరి వైఖరిపై బాలయ్య అభిమానులు గుర్రుగా ఉన్నారు..

శాతకర్ణితో ఫుల్ ఫాంలోకి వచ్చిన బాలయ్య.. అసలు పూరి కథకు ఎలా కనెక్ట్ అయ్యాడో తెలియక బాలయ్య అభిమానులు టెన్షన్ పడుతున్నారు. పూరి మాఫియా కథలకు, బాలయ్య ఫాక్షన్ బ్యాక్ డ్రాప్ కు అస్సలు సెట్ కాదు. మరీ వీరిద్దరు కలిసి తీస్తున్న సినిమా కావడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంట అందరిలోనూ నెలకొంది.

To Top

Send this to a friend