చెక్కడం మొదలుపెడితే మాలాగ ఎవ్వరూ చెక్కలేరు


భజన భక్తుల మోసేయడం ఎక్కువైపోయింది. ఏపీ రాష్ట్రాన్ని ప్రజలను ఉద్దరిస్తున్నది వీరే అన్న రీతిలో పత్రికలు తెగ మోసేస్తున్నాయి. ఆంధ్రజ్యోతి ఈనాడు లు అధికార టీఆర్ఎస్, టీడీపీ పంచన చేరడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థి మీడియా పాత్ర పరిమితమైంది. ఆంధ్రలో ప్రధాన ప్రతిపక్ష పాత్రలో సాక్షి టీడీపీ టార్గెట్ గా రెచ్చిపోతున్నా.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ కు ఎదరు నిలవడం లేదు. ఎందుకంటే కేసీఆర్ మీడియా మేనేజ్ మెంట్ తో.. నిషేధాలతో మీడియాను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.

ఇక ఆంధ్రజ్యోతి సైతం మొదట్లో కయ్యానికి కాలుదువ్వి కేసీఆర్ ను నానా డ్యామేజ్ చేసి మంత్రి తుమ్మల రాయబారంతో ఇప్పుడు కేసీఆర్ భజనలో తరిస్తోందన్నది విమర్శకుల భావన.. ఏది ఎలా ఉన్న కూడా ఇప్పుడు పత్రికల భజన పెరిగిపోయింది..

ఈరోజు ఆంధ్రజ్యోతి కార్టూన్ చూశాక అదే అనిపించింది. మేడే దినోత్సవం సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రి అభివృద్ధి కోసం శిలలు చెక్కుతున్నారని.. రాష్ట్రాల అభివృద్ధికి కష్టపడుతున్నారనే కార్టూన్ చూడడానికే విచిత్రంగా ఉంది. ఇంతలా మోసేయాలా అన్న భావన వ్యక్తమవుతోంది.

To Top

Send this to a friend