చీప్ అనే తెగ కొనేశారు..


బీఎస్3 వాహనాలకు చెల్లు చీటి పాడి.. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 2 వాహనాలనే విక్రయించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో పాత ద్విచక్రవాహనాలు ఒక్కవారంలోనే లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. హోండా, హీరో, బజాజ్, టీవీఎస్ కంపెనీల వద్ద మొత్తం వాహనాలను చివరి వారంలో దుకాణాలకు తరలించారు. దుకాణాదారులు ఒక్కో వాహనంపై 10 నుంచి 20 వేల తక్కువకు అమ్ముతామని ప్రకటనలు గుప్పించారు. దీంతో ఉన్నోళ్లు, లేనోళ్లు అందరూ తక్కువ ధరకు బైక్ లు వస్తున్నాయని తెగ కొనేశారు..

కాగా ద్విచక్రవాహనాల యజమానులు వాహనాల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడ్డట్టు ప్రభుత్వం గుర్తించింది. అధికారికంగా అమ్మకుండా దొంగదారుల్లో బైక్ లు అమ్మేశారని.. తద్వారా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రాకుండా మాయ చేశారని ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు..

పెద్దమొత్తంలో తక్కువ ధరకు వాహనాలు అమ్ముతామని పత్రికల్లో ప్రకటనలు రావడంతో జనం ఎగబడ్డారు. కానీ ద్విచక్రవాహనాల షోరూంలకు వెళ్లేసరికి అక్కడ అంతటా నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మరి ఇన్ని వేల వాహనాలకు ఎటు అమ్మినట్లో తెలియక జనాలు, ఐటీ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఆదాయపు పన్ను ఎగవేసి అక్రమంగా అమ్ముకున్నారని తెలిసి ఇప్పుడు ఐటీ అధికారులు బైక్ షోరూం కంపెనీలపై దాడులు చేసేందుకు సిద్ధమయ్యారట..

To Top

Send this to a friend