చట్టవిరుద్దంగా బాహుబలి షోలు?


తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. తెలుగు కీర్తిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో బోలెడు అంచానాలున్నాయి. అందుకు అనుగుణంగానే బాహుబలి నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించారు.

బాహుబలి కోసం జనం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని.. అందుకే నాలుగు షో ల స్థానంలో ఆరు షోలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని లు ఈ మేరకు చంద్రబాబు.. ఇటు తెలంగాణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని కలిసి ఏర్పాట్లు చేశారు. దీనికి చంద్రబాబు సై అని ఏపీలో 6 షోలకు అనుమతులు ఇచ్చేశారు. ఈ లాబీయింగ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలకభూమిక పోషించారని తెలిసింది.

ఇక తెలంగాణలో మంత్రి తలసానిని కలిసిన బాహుబలి నిర్మాతలు ప్రీమియర్ షోలకు తలసానిని, కేసీఆర్ ను అహ్వానించారు. తెలంగాణలోనూ 6 షోలకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు.కానీ తలసాని 5 షోలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.

ఉదయం 7 గంటల నుంచితెల్లవారుజామున 2.30గంటల వరకు బాహుబలి షోలు ప్రసారం చేస్తారు. కాగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ప్రేక్షకుల సంఘం సభ్యులు సోమవారం ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సినిమా ప్రసారాలపై చట్టంలో పేర్కొన్నారని.. రాత్రి 1 గంట తర్వాత ప్రసారం చేయవద్దని చట్టంలో ఉందని.. అందుకు విరుద్ధంగా బాహుబలిని ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

To Top

Send this to a friend