చట్టంతో చుట్టం.. జగన్ ను క్లోజ్ చేద్దాం..


ఉగాది పేరుతో వెంకయ్య వంకర రాజకీయం జడ్జీలకు విందు

చట్టాలను, చట్టసభ్యులను న్యాయవాదులను మేనేజ్ చేయడంలో చంద్రబాబు.. ముఖ్యంగా వెంకయ్యనాయడు ఆరితేరిపోయారు. అందుకే ఎన్నికేసులు నమోదైనా అటు చంద్రబాబుపై.. ఇటు వెంకయ్యనాయుడుపై ఒక్క కేసు నిలబడదు.. ఎందుకో ఏమిటో అంటే కొన్ని కొన్ని ఉదాహరణలు అప్పుడప్పుడు మనకు కనిపిస్తాయి..

వెంకయ్య ఇంట్లో సుప్రీంకోర్టు జడ్జీలు నిన్న ఓ విందులో పాల్గొన్నారు. అదే విందో.. ఎందుకు జరిగిందో.. అదేమిటో ఈ జడ్జీలు బయట ఎవరింటికి చెప్పలేదు. ఆ విందుకు ఒక్క చంద్రబాబు , వెంకయ్య మాత్రమే రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య , బాబు మినహ మిగతా వారెవ్వరు పాల్గొనలేదు.. వేరే రంగాలవారిని పెద్దగా పిలవలేదు.. బహుశా జగన్ ను జైలుకు పంపడానికి ప్లాన్ స్కెచ్ రెడీ చేశారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఉగాది సందర్బంగా వెంకయ్య నాయుడు ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. ఓటుకి నోటు కేసులో ఈరోజో రేపో తదుపరి ఉత్తర్వులు వెలువడొచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి . ఇక అంతే అనుకున్నదే తడువుగా ఉగాదిని పురస్కరించుకొని అను’కుల’ జడ్జీలందరిని పండగ పేరుతో ఇంటికి పిలిచి విందు ఇచ్చారు. జగన్ కేసులో జడ్జీలు ఎలాంటి తీర్పులు ఇవ్వాలి , ఎలా వాదిస్తే ఎలాంటి తీర్పు ఇవ్వొచ్చో చర్చించినట్టు రహస్య సమాచారం. రేపు చట్టాలకు దొరకకుండా ఏమేమి లొసుగులు ఉన్నాయో మొత్తం కూలంకుషంగా చర్చించుకొని యధావిధిగా ఉగాది కానుకలు సమర్పించుకున్నారని ఇన్ సైడ్ టాక్..

కీలకమైన విషయం ఏంటంటే.. ఓటుకి నోటు కేసుకి జడ్జిగా ఉన్న లావు నాగేశ్వరరావు తోపాటు , బాబు ఆస్థాన జడ్జీలు జాస్తి చలమేశ్వర్ , నున్న రమణ , యానిమల్ మేనకోడలు జస్టిస్ రోహిణి – అందరూ కలిసి వెంకయ్య ఇంట్లో ఉగాది సంభరాలు ఆనందంగా ఉల్లాసంగా పాల్గొన్నారు.

ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు , మోడీ కూడా మావాడే మీరు ఎలాంటి తీర్పులిచ్చినా మీకు ఎటువంటి ఢోకా లేదు అని తద్వారా జడ్జీలకు సందేశం ఇచ్చారు .

ఇలా చట్టాలను.. చట్టసభ్యులను తమకు అవకాశంగా మలుచుకొని వ్యవస్థలనే నాశనం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే.. వెంకయ్య , బాబులకు వ్యతిరేకంగా మోడీ కాదు కదా.. పైనున్న దేవుడుకూడా చేసేదేమి లేదు .

To Top

Send this to a friend