చట్టం.. చంద్రబాబు చుట్టం మరీ..

 

ఎన్నో ఉదాహరణలు.. ఎన్నో అక్రమాలు.. అది అధికార పక్షం చేస్తే ఒక లెక్కా..? ప్రతిపక్షానికి మరో లెక్కా.. ఇంత నిస్సిగ్గుగా అధికార అండతో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను ఆపేదెట్టా..? ఆ పార్టీ అధినేతకు తెలిసేదెట్ట..? ప్రతిపక్ష వైసీపీ ఈ ఉదంతంలో సమిధగా మారిపోతోంది. అన్యాయాలను ప్రశ్నించినందుకు కటకటాల పాలవుతోంది.

విజయవాడ నగరంలో రోడ్డు ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, ఎమ్మెల్సీ బుడ్దా వెంకన్నలు దాడి చేశారు. వీరు సారి చెప్పారని ఆ వివాదాన్ని అక్కడితో ఆపేశారు. దీన్ని నిరసిస్తూ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ తో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అమరావతిలోని కొత్త అసెంబ్లీ ఎదుట మౌనదీక్ష చేపట్టారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలంతా మద్దతిచ్చారు.

ఇంత జరుగుతున్నా ఇన్ని అడ్డగోలు వైఖరులు చేస్తున్నా టీడీపీ ప్రభుత్వానికి కించత్ కూడా పశ్చాతాపం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఆందోళన చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులను బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యేలు సారీ చెప్పి తప్పించుకుంటే.. అదే గతంలో బెదిరించిన జగన్ కానీ.. వైసీపీ ఎమ్మెల్యేలను కానీ ఇదే టీడీపీ ప్రభుత్వం జైలుకు పంపింది. అంటే అధికార పార్టీకి ఒక లెక్కా.. ప్రతిపక్షానికి మరో లెక్కా..? ఏమీటీ దారుణం జనం ప్రశ్నిస్తున్నారు.

To Top

Send this to a friend