డ్రగ్స్ కేసులో హైకోర్టుకు చార్మి

డ్రగ్స్ కేసులో మరో చిన్న ట్విస్ట్. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న డ్రగ్స్ కేసులో సంబంధమున్న సినీ ప్రముఖుల్లో కొంత రెవెల్యూషన్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా నటి చార్మి దీనిపై పోరుబాటకు శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ కేసులో తనను పోలీసులు ఇరికించడంపై నటి చార్మి ఈరోజు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ సరిగా లేదని.. అమాయకులను విచారిస్తున్నారని.. అమ్మేవారిని విచారించకుండా సినిమా నటులను టార్గెట్ చేశారని.. మహిళలను అని కూడా చూడకుండా మగ పోలీసులతో విచారణకు ప్రయత్నిస్తున్నారని.. ఈకేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని స్టే ఇవ్వాలని చార్మి పిటీషన్ వేసినట్టు సమాచారం.

డ్రగ్స్ కేసులో దూకుడుగా ముందుకెళ్తున్న తెలంగాణ పోలీసులకు నటి చార్మి హైకోర్టుకు వెళ్లి గట్టి సమాధానం ఇచ్చింది.. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో చార్మిని ఈ నెల 26 న సిట్ ముందుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే చార్మి గురువు పూరి జగన్నాథ్ , సుబ్బరాజు, శ్యాంకే నాయుడులను సిట్ విచారించి వారి రక్త నమూనాలు, గోళ్లు వెంట్రుకల శాంపిల్స్ ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. ఇప్పుడు ఈనెల 26న చార్మి కూడా హాజరు కావాల్సి ఉంది.

హైకోర్టు ఈరోజు సాయంత్రం చార్మి వేసిన పిటీషన్ పై విచారించనున్నట్టు తెలిసింది. ఒకవేళ స్టే ఇస్తే చార్మి విచారణకు బ్రేక్ పడుతుంది. లేదంటే సిట్ ను ఈ కేసులో కౌంటర్ పిటీషన్ వేయాలని కోరచ్చు.. ఏది ఏమైనా సినీరంగ ప్రముఖుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న పోలీసులకు చార్మి హైకోర్టును ఆశ్రయించి గట్టి షాక్ ఇచ్చింది. ఈ విచారణకు ఇప్పుడు బ్రేక్ పడినా పడొచ్చు.

To Top

Send this to a friend