బన్నీని చూసి కుళ్లుకుంటున్న చరణ్‌

మెగా ఫ్యామిలీ హీరోలు అయిన రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ల మద్య పైకి చూస్తే స్నేహం ఉంది అనిపిస్తుంది. కాని వీరిద్దరి మద్య తీవ్రమైన పోటీ ఉంటుందని, ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తారని, ఒకరిపై ఒకరు ఎప్పుడు కూడా పోటీ పడుతుంటారు అనే విషయం కొందరికే తెలుసు. అల్లు అర్జున్‌ సినిమా వేడుకలకు చరణ్‌ వెళ్తాడు, చరణ్‌ సినీ వేడుకలకు బన్నీ వస్తాడు. కాని ఇద్దరు కూడా తన సినిమానే గొప్పగా ఉండాలి అనే పోటీ పడుతూ ఉంటారట.

చరణ్‌ గతంలో పలు సార్లు బన్నీ సినిమాలను బీట్‌ చేసేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ప్రముఖ దర్శకుడి వద్ద చరణ్‌ ‘మగధీర’ చిత్రాన్ని బీట్‌ చేసే సినిమా చేయాలని తనకు ఉంది అంటూ బన్నీ చెప్పుకోచ్చాడట. అలా ఇద్దరిమద్య పోటీ తీవ్రంగా ఉన్న సమయంలోనే అల్లు అర్జున్‌ నటించిన ‘సరైనోడు’ చిత్రం దుమ్ము రేపడం ఇప్పుడు చరణ్‌కు మింగుడు పడటం లేదు. ఇటీవలే హిందీలో డబ్బ్‌ అయ్యి సోనీ మ్యాక్స్‌లో సరైనోడు అదే టైటిల్‌తో ప్రసారం అయ్యింది. అలాగే వెంటనే యూట్యూబ్‌లో కూడా వచ్చింది.

యూట్యూబ్‌లో ‘సరైనోడు’ రికార్డులను చూసి బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఆ స్థాయి వ్యూస్‌ను దక్కించుకున్నది లేదు. ఒక సౌత్‌ సినిమా, అది తెలుగు సినిమా హిందీలో డబ్‌ అయ్యి బాలీవుడ్‌ సినిమాల రికార్డులను బద్దలు కొడుతుంది. ఇటీవల విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ ట్రైలర్‌ కంటే ఎక్కువ వ్యూస్‌ను దక్కించుకుని దూసుకు పోతుంది. అయిదు కోట్ల వ్యూస్‌ దిశగా సరైనోడు పరుగులు తీస్తున్నాడు. ఇక సన్నాఫ్‌ సత్యమూర్తి కూడా హిందీ వర్షన్‌ మూడు కోట్ల వ్యూస్‌ను దక్కించుకుని సంచలనం సృష్టించింది. ఇలా హిందీలో బన్నీ దూసుకు పోవడం చూసి చరణ్‌ కుళ్లుకుంటున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరణ్‌ నటించిన ఒక్క హిందీ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయిన విషయం తెల్సిందే.

To Top

Send this to a friend