చరణ్-అల్లు అర్జున్ తో.. 


అప్పుడెప్పుడో ధర్మేంద్ర, అమితాబ్ నటించిన షోలే సినిమా ఇండస్ట్రీ హిట్.. అంత పెద్ద హీరోలు కలిసి చేయడమే ఓ పెద్ద సంచలనమైంది. ఆ సినిమా విజయవంతం అయ్యింది. తెలుగులో ఇలా టాప్ హీరోలు చేయడమే గగనం.. కానీ ఇప్పుడు ఇద్దరు ఫుల్ ఫాంలో ఉన్న దిగ్గజ హీరోలతో టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ సినిమా ప్లాన్ చేశాడు. అంతేకాదు చిత్రం పేరును రిజిస్ట్రర్ చేయించేందుకు సంప్రదించినట్టు సమాచారం..

తెలుగులో ఎవడు సినిమాలో రాంచరణ్-అల్లు అర్జున్ కలిసి నటించారు. కానీ అందులో అల్లు అర్జున్ ది కొన్ని నిమిషాల పాత్రనే.. కానీ వీరిద్దరితో కలిసి ఫుల్ లెంగ్త్ మూవీని తీసేందుకు అల్లు అరవింద్ ప్రయత్నాలు మెదలుపెట్టారు. సినిమా టైటిల్ చరణ్-అర్జున్ పేరును కూడా రిజిస్ట్రర్ చేయించనున్నట్టు ఫిలింనగర్ సమాచారం..

తెలుగులో వచ్చే టాప్ మల్టీస్టారర్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది… గతంలో వెంకటేశ్-మహేశ్ బాబు కలిసి నటించారు. ఆ సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు చరణ్-బన్నీ కలిసి నటిస్తే మెగా అభిమానులకు పండుగే.. ఈ సినిమా కోసం ఓ టాప్ డైరెక్టర్ ను సంప్రదించినట్టు తెలిసింది. కథ సిద్దం కాగానే సినిమా మొదలు కాబోతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

To Top

Send this to a friend