పేరు మార్చుకుంటే.. ఫేట్‌ మారుతుందా?

తాత గొప్ప నటుడు, తండ్రి నటనతో పాటు తన డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన ఆది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు. మొదటి ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన అన్ని సినిమాలు కూడా దారుణంగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆ యువ హీరో ఎవరో అర్థం అయ్యి ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే మేం చెబుతున్నది ఆది గురించే. వరుసగా సినిమాలు చేస్తున్నా లక్‌ కలిసి రాకపోవడంతో ఆది కెరీర్‌ కష్టాల్లోకి జారుతుంది.

ఆది సినిమాల్లో రాణించలేడు అని కొందరు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇక సినిమాలు మానుకోవాలని కొందరు అంటున్నారు. ఈ సమయంలోనే ఆది ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన తండ్రి పేరును తన పేరుతో లక్‌ను తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ఇకపై ఎక్కడైనా తన పేరును ఆది సాయికుమార్‌గా వేయాల్సిందిగా మీడియా వారు మరియు సినీ పరిశ్రమ వారు కూడా తనను ఆది సాయికుమార్‌గా సంబోధించాలని కోరుతున్నాడు.

అవకాశాలు రాక పేర్లు మార్చుకున్న వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే పేర్లు మార్చుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుంది అంటే అది అత్యాశే అవుతుంది. తన తండ్రి పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రేక్షకులు ఆధరిస్తారా అనేది చూడాలి. తాజాగా ఆది ‘శమంతకమణి’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఆయన తర్వాత కెరీర్‌ ఆధారపడి ఉంటుంది.

To Top

Send this to a friend