బాబు, జగన్ లకు ఇది జీవన్మరణ సమస్యే..

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. జగన్, చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పుడే రెడీ అయిపోతున్నారు. వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఎన్నికకు వేళయ్యింది. నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు, జగన్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన భూమా నాగిరెడ్డి మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టీడీపీ తరఫున భూమా ఫ్యామిలీ నుంచి భూమా బ్రహ్మానందారెడ్డి బరిలో నిలిచారు. ఇక ఇన్నాళ్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరి నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో దిగారు. దీంతో పోటీ నువ్వానేనా అన్నట్టు తయారైంది.

నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు బాబు, జగన్ లకు జీవన్మరణ సమస్యగా మారింది. ఇది నిజానికి వైసీపీ సీటు.. భూమా గెలిచి టీడీపీలో చేరారు. అధికారం ఉన్న పార్టీ టీడీపీ ఓడిపోతే 2019 ఎన్నికల్లో ఓటమి ఖాయమనే అపప్రద వస్తుంది. దీంతో పార్టీయే నీరుగారి జగన్ పార్టీలోకి వలసలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అనుంగ బలాలను నంద్యాలలో ప్రయోగిస్తున్నారు. రౌడీలను కూడా దించేసి టీడీపీ గెలుపుకు వ్యూహరచన చేస్తున్నారు.

ఇక వైసీపీ నంద్యాలలో ఓడిపోతే వచ్చే ఎన్నికల వరకు కోలుకోవడం కష్టం. ఇప్పటికే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మరో 5 ఏళ్లు ఉండొద్దనే సూచనతోనే ఢిల్లీలో ప్రఖ్యాత వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తీసుకొచ్చి ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. నంద్యాల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి వైసీపీలో ఆత్మస్థైర్యం నింపాలని యోచిస్తున్నారు. ఇప్పుడు గెలవకపోతే ఇక 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించడం కష్టమని సర్వశక్తులూ వడ్డడానికి ప్రయత్నిస్తున్నారు. మనుగడే కష్టమవుతున్న నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక చంద్రబాబు, జగన్ లకు జీవన్మరణ సమస్యగా మారింది.

To Top

Send this to a friend