వార్ వన్ సైడే.. బాలయ్య బరిలోకి..

జగన్ స్వయంగా రంగంలోకి దిగాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారం పర్వాన్ని మొదలెట్టేశాడు. మరో వైపు చంద్రబాబు ఏమో ప్రభుత్వ పాలన, పని ఒత్తిడితో నంద్యాలలో ప్రచార బాధ్యతలను మంత్రులు కీలక నేతలకు అప్పగించి పర్యవేక్షిస్తున్నారు.. దీంతో టీడీపీ ప్రచారంలో వెనకబడి పోతుండగా.. జగన్ పార్టీ వైసీపీ మాత్రం దూసుకుపోతోంది.

జగన్ చంద్రబాబును ఉద్దేశించి నంద్యాలలో ‘చంద్రబాబును కాల్చేయాలి.. ఉరితీయాలి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఆ స్థాయిలో టీడీపీ నుంచి ఎదురుదాడి.. మాటలు రావడం లేదట.. టీడీపీ నేతలందరూ తూతు మంత్రంగా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తున్నారు తప్పితే జగన్ ను సరిగ్గా ఎదుర్కోవడం లేదని క్షేత్ర స్థాయి పరిస్థితిని బట్టి తెలుస్తోంది. ఇలా ఎంతమందిని నంద్యాలలో ప్రచార పర్వంలో దించినా టీడీపీ ప్రచారం అంతంతమాత్రంగానే సాగుతుండడంపై పార్టీ అధినేత చంద్రబాబు అసహనం తో ఉన్నారని సమాచారం.

దీంతో చంద్రబాబు మదిలో బాలయ్య మెదిలినట్టు సమాచారం. బాలక్రిష్ణ తో నంద్యాలలో ప్రచారం చేస్తే కాసిన్ని ఓట్లు పడతాయని.. భూమా అఖిల ప్రియ, బ్రహ్మానందారెడ్డిలతో కలిసి ప్రచారాన్ని చేయిస్తే టీడీపీ గెలుపుపై ధీమా వస్తుందని చంద్రబాబు ప్లాన్ చేసినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే బాలయ్య నంద్యాల ఎన్నికల ప్రచార బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

To Top

Send this to a friend