వైసీపీతో బీజేపీ దోస్తీ.. బాబుకు మండింది..

రాష్ట్రపతి అభ్యర్థి రామ్ కోవింద్ తరఫున నాలుగో సెట్ నామినేషన్ దాఖలు చేయడానికి వైసీపీ ఎంపీ మేకపాటికి స్వయంగా బీజేపీ ఆహ్వానించడం టీడీపీలో కలకలం రేపింది.. జగన్ పార్టీకి మోడీ, బీజేపీ అధిష్టానం ఇస్తున్న ప్రాముఖ్యతపై చంద్రబాబు అండ్ కో మండిపడుతోందట..

రాష్ట్రపతిగా మొదటిరోజు మోడీతో సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు పాల్గొన్నారు. ఇప్పుడు నాలుగో సెట్ నామినేషన్ కు వైసీపీ ఎంపీకి ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడు నో అన్నా కూడా ప్రధాని మోడీ.. జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎంపీని రాష్ట్రపతి అభ్యర్థి కోసం మద్దతివ్వడం వివాదాస్పదమైంది. టీడీపీకి వ్యతిరేకంగా మోడీ వ్యవహరిస్తున్నట్టు తేటతెల్లమైంది.

To Top

Send this to a friend