చంద్రబాబు సర్కారుకు హైకోర్టు షాక్..


అమరావతిని సింగపూర్ లా చేస్తానన్న చంద్రబాబు ఆశలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల విషయంలో చంద్రబాబు సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల లోపు రాజధాని పనులు మొదలు పెడదామనుకుంటున్న చంద్రబాబుకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది..

ఏపీ రాజధాని అమరావతి కోసం భూమల సేకరణలో భాగంగా ఏపీ సర్కారు అమరావతి శివారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతుల భూమల కోసం భూసేకరణ నోటిపికేషన్ ఇచ్చింది. దీనిపై 904మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భూములు ఇచ్చేందుకు తమకు ఇష్టం లేదని రైతులు హైకోర్టులో పిటీషన్ వేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా గ్రామ తీర్మానాలు చేసినా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదంటూ తమ భూములు లాక్కోవాలని చూస్తున్నారని రైతులు పిటీషన్ లో విన్నవించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు పెనుమాక భూసేకరణ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే భూములు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతవరకు భూములు తీసుకొవద్దని.. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు సోమవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ పరిణామాలపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని పనులకు ఇది పెద్ద విఘాతమని సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా ప్రతిపక్ష నాయకుడు జగన్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి మాత్రం రైతులకు న్యాయం జరిగిందని.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇదో గుణపాఠమని.. రైతుల భూములు లాక్కుంటే ఊరుకోబోమని హెచ్చరించారు.

ఈ వివాదం ఎలా ఉన్న పెనుమాక రైతులు మాత్రం తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడంపై హర్షం వ్యక్తంచేస్తూ న్యాయం గెలిచిందని సంబరాలు చేసుకొన్నారు. తమ భూములు పోకుండా అండగా నిలిచిన వైసీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.

To Top

Send this to a friend