నవ నిర్మాణంలో బాబు ఆవేదన ఉంది..

‘రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించారయ్యా..’ బాబు ఆవేదన.. నవనిర్మాణ దీక్ష వేదికగా బాబు ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. అన్యాయంగా.. అవమానకరంగా విభజన చేసిన తీరును బాబు ఎండగట్టారు. కసి, పట్టుదలతో రాష్ట్రాభివృద్దిని చేస్తానని స్పష్టం చేశారు. నేటినుంచి ఏడు రోజుల పాటు నవనిర్మాణ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలో ఏం సాధించామో చెప్తానని బాబు చెప్పారు.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఏపీ విభజనతో కుదేలైంది. ఒంటరి అయ్యింది..రాజధాని కూడా లేకుండా ఏపీ ప్రజలు కట్టుబట్టలతో హైదరాబాద్ ను వీడారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎండనక.. పగలనక వివిధ దేశాలు పట్టుకొని పెట్టుబడుల కోసం తిరుగుతున్నాడు. అయినా ఎన్నో ఆటంకాలు.. నిధుల కొరత.. అయినా ఏపీ సీఎం పనిచేస్తున్నారు.

ఎన్నికలకు ముందు తోడుగా ఉన్న బీజేపీ నేడు సహాయనిరాకరణ చేస్తోంది. ఇవ్వాల్సినన్నీ నిధులు ఇవ్వకుండా కొసరు కొసరి పెడుతోంది. అయినా మిత్రలాభాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీతోనే బాబు పయనిస్తున్నారు. ఏపీకి నిధుల కోసం తొక్కని గడప లేకుండా బాబు తిరుగుతున్నాడు.

ఏదీ ఏమైనా తెలంగాణ, ఏపీ విడిపోయి నేటికి మూడేళ్లు.. తెలంగాణ మూడేళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తుంటే.. ఏపీ మాత్రం విడిపోయిన నష్టపోయిన రోజును గుర్తు చేసుకుంటోంది. నవనిర్మాణం పేరుతో సానుభూతిని తెచ్చుకుంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగంలో అది ప్రస్ఫూటమైంది.

To Top

Send this to a friend