చంద్రబాబే దిక్కు అప్పుడు.. ఏకు మేకు ఇప్పుడు..


మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. విడిపోయిన ఏపీకి తొలి ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ పనిచేశారు. చంద్రబాబుకు అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నో కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామి అయ్యారు… చంద్రబాబు ఐవైఆర్ పనితనం మెచ్చి ఆయన రిటైర్ అవ్వగానే ‘బ్రాహ్మణ కార్పొరేషన్’ ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్ ను చేశారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో ఐవైఆర్ కు అత్యున్నత పదవి లభించినట్టైంది.

అలాంటి వ్యక్తి ఐవైఆర్ ఇప్పుడు చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వివాదాస్పదమవుతోంది. వైఎస్ఆర్ సీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్ లను ఐవైఆర్ షేర్ చేస్తుండడంతో టీడీపీ సానుభూతిపరులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియడంతో ఐవైఆర్ పదవి ఉంటుందా ఊడుతుందా అన్న మీమాంస నెలకొంది.

చంద్రబాబు గతంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో లబ్ధి పొంది కార్పొరేషన్ పదవి పొందిన ఐవైఆర్ ను కూడా అరెస్ట్ చేయిస్తాడా.? లేక పదవి ఊడగొట్టిస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. మాజీ ఐఎఎస్, మాజీ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేయించడం అంత సులువు కాకున్నా టీడీపీపై వ్యతిరేక పోస్టుల నేపథ్యంలో ఆయన పోస్టుకు మాత్రం ఎసరువచ్చేలా కనిపిస్తోంది.

To Top

Send this to a friend